15 ఏళ్ల ధీర్ఘకాలిక సమస్యను పరిష్కరించిన ఎఇ శ్రీరామ్
ప్రజాశక్తి – ఉంగుటూరు
నారాయణపురం టూరింగు పేట, వైఎస్‌ఆర్ నగర్, ఎన్‌టిఆర్ కాలనీ, కొత్త ఉంగుటూరు విద్యుత్ వినియోగదారుల సమస్యలు తీర్చేందుకు అధికారులు చేపట్టిన పనులు పూర్తి కావచ్చాయి. 2011కు ముందు నారాయణపురం విద్యుత్ ఉపకేంద్రం నుంచి నారాయణపురం, కొత్త ఉంగుటూరు గ్రామాలకు విద్యుత్ సరఫరా చేసేవారు. అయితే 2011లో చేబ్రోలు విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మించాక ఈ గ్రామాలకు చేబ్రోలు ఎస్‌ఎస్ నుంచే పవర్ సరఫరా చేసేవారు. చేబ్రోలు, నారాయణపురం టూరింగుపేట, వైఎస్‌ఆర్ నగర్, ఎన్‌టిఆర్ కాలనీ, కొత్తఉంగుటూరుతో పాటు నిడమర్రు మండలం కొల్లేరు గ్రామాలకు రక్షిత తాగునీటిని అందించే ఆర్‌డబ్ల్యూఎస్ ట్యాంకు కూడా నారాయణపురంలో ఉంది. సుమారు 1600 సర్వీసులకు ఒకటే ఫీడర్ ద్వారానే విద్యుత్ వచ్చేది. దీంతో ఈ నాలుగు ఆవాస ప్రాంతాల్లో ఎక్కడైనా సమస్య వస్తే ఈ 1600 మంది సర్వీసులకు విద్యుత్ సరఫరా నిలిచిపోయేది. దీనికి తోడు నారాయణపురంలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీల సర్వీసుల కూడా ఇదే ఫీడరు మీద ఉండటంతో విద్యార్థులు ఆన్‌లైన్ పరీక్షల సమయంలో ఎన్నో ఇబ్బందులు పడేవారు. నిడమర్రు మండలంలో తోకలపల్లి, బైనేపల్లి, ఆముదాలపల్లి, చిననిండ్రకొలను గ్రామాలకు తాగునీటి సరఫరా సైతం కష్టంగా ఉండేది.రూ.15 లక్షలతో పనులు పూర్తిఎఇ శ్రీరామ్‌సుమారు 1600 సర్వీసులకు ఇప్పటి వరకూ చేబ్రోలు ఫీడర్ మీదే ఉండేది. దీంతో అత్యవసర సమయంలో ఎల్‌పి తీసుకున్నా, ఎమ ర్జన్సీ లోడ్ రిలీఫ్ తీసుకున్నా వీళ్లందరి కి కరంటు ఉండేది కాదు. దీనికి పరి ష్కారం కోసం ఉంగు టూరు సబ్ స్టేష న్ నుంచి రూ. 15 లక్షలతో కొత్తగా లైన్ వేసి ఉంగుటూరు ఫీడరుపైన లైన్ కలిపేందుకు ఎంఎల్‌ఎ ధర్మరా జు, ఎడిఇ ఎన్.శ్రీనివాసరావులు సహకారం అందించారు. ధీర్ఘకాలిక సమస్య పరిష్కారం కావడం సంతోషంలైన్‌మెన్ దుర్గారావునారాయణపురం టూరింగుపేట పాటు సుమారు 1600 సర్వీసులకు చేబ్రోలు ఫీడరు మీద ఉండటంతో నిత్యం విద్యుత్ సమస్యతో క్షణం తీరిక లేకుండా ఉండేది. రేయింబవళ్లు ఏదోక సమస్య రావడం నిత్యం ఫీల్డ్‌లోనే ఉండాల్సి వచ్చేంది. అస్తమానం కరంటు పోవడంతో వినియోగదారుల నుంచి ఎన్నో ఒత్తిళ్లు వచ్చేవి. అధికారుల దృష్టికి ఎప్పటికప్పుడు సమస్యను తీసుకెళ్లేవాళ్లం. దీంతో ఉంగుటూరు సబ్ స్టేషన్ నుంచి సరఫరాలను ఆల్ట్‌ర్‌నేటివ్ విధానంలో కలిపేలా సుమారు ఏదాదిన్నర నుంచి లైన్ నిర్మాణ పనులు ఇప్పటికి పూర్తయ్యాయి. చేబ్రోలు ఎస్‌ఎస్‌లో సమస్య వస్తే ఉంగుటూరు ఎస్‌ఎస్ నుంచి సరఫరా ఇస్తాం. ఇక కరంటు సమస్యలు తీరినట్టే.
