ప్రజాశక్తి – దెందులూరు
స్థానిక ఏలూరు దొండపాడులోని ఉమా ఎడ్యుకేషనల్, టెక్నికల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న జిల్లా వికలాంగుల పునరావాస కేంద్రం ద్వారా అవసరమైన వికలాంగులకు కృత్రిమ అవయవాల పంపిణీ విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు బి.రామ్‌కుమార్ చేతుల మీదుగా జరిగింది. మొదటగా రామ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో వికలాంగుల పునరావాస కేంద్రం ఉండడం చాల అవసరమని, దీని ద్వారా వికలాంగులకు అవసరమైన కృతిమ అవయవాలు, ఫిజియో థెరపీ, అడియోలజీ, స్పీచ్ థెరపీ తదితర సేవలు ఉపయోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఎడి ప్రసాద్ రావు, సంస్థ కోఆర్డినేటర్ డి.శ్రీనివాస్ రెడ్డి, ఆశాజ్యోతి హ్యాండీక్యాప్డ్ స్కూల్ ప్రిన్సిపల్ మాధవీలత పాల్గొన్నారు.