విచ్చేయనున్న జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్
ప్రజాశక్తి – ఏలూరు
జిల్లా అభివృద్ధి సమీక్ష కమిటీ (డిఆర్‌సి) సమావేశం ఈ నెల 16వ తేదీ గురువారం నిర్వహించనున్నారు. ఏలూరు కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశ మందిరంలో గురువారం ఉదయం 11 గంటల నుంచి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి, ఎంపీ, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, జిల్లా అధికారులు పాల్గొంటారు. జిల్లాలో చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులు, అమలవుతున్న సంక్షేమ పథకాలు, భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్, దీపం, ధాన్యం కొనుగోలు, ఇండిస్టియల్ పార్కులకు భూమి లభ్యత, శాంతి భద్రతలు, పరిపాలనాపరమైన అంశాలపై సమీక్షిస్తారు.
