డ్వాక్రా ఉత్పత్తులు డెలివరీ వేగవంతం చేయాలి

Mar 26,2025 12:43 #Eluru district

ప్రజాశక్తి-కొయ్యలగూడెం : ప్రభుత్వం మహిళలను లక్షాధి కారులను చేసే లక్ష్యంతో ఆన్ లైన్ లో వచ్చిన డ్వాక్రా ఉత్పత్తులు డెలివరీ వేగవంతం చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ఆర్.విజయ్ రాజు చెప్పారు. కొయ్యలగూడెం మండలం కనకాద్రిపురం గ్రామంలో “గుడ్ హెల్త్ “ బ్రాండ్ పేరుతో తయారు చేస్తున్న చిరు ధాన్యాల ఉత్పత్తులను మంగళవారం రాత్రి పరిశీలించారు. ఓఎన్డిసి ఆన్ లైన్ ప్లాట్ ఫారంలో డ్వాక్రా మహిళలు చేసిన ఉత్పత్తలు తయారీ విధానం, ప్యాకింగ్ విధానం, ఏయే సంస్థలు ద్వారా డెలీవరీ చేసున్నారో తెలుసుకోవటానికి రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు ప్రాజెక్టు డైరెక్టర్ పరిశీలించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ వారి ఆదేశాలతో ప్రతీ మండలంలో డ్వాక్రా మహిళకు వచ్చిన ఆర్డర్ల ఏవిధంగా డెలివరీ చేస్తున్నారో పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు ఆరోగ్యాన్ని అంధించే చిరు ధాన్యాల ఉత్పత్తులు త్వరితంగా చెరవేయాలని సూచించారు. ఈ మేరకు ఎక్స్ప్రెస్స్ బీ అనే డెలివరీ సంస్థ ప్రతినిధులు సాయి, ఆరీఫ్ లతో చర్చించి ఆయన చేతులు మీదుగా ఉత్పత్తులు డెలివరీ చేశారు. జిల్లాలో 17 మండలాల్లో డ్వాక్రా మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులు 10903 ఆన్ లైన్ లో విక్రయాలు జరిగాయని చెప్పారు. వాటిలో ఆగిరిపల్లి, కొయ్యలగూడెం, కైకలూరు, మండవల్లి మండలాలు ముందు వరసలో ఉన్నయన్నారు. ఆగిరిపల్లిలో ముగ్గురు డ్వాక్రా సంఘాలు చేసన 2198 ఉత్పత్తులలో 314, కైకలూరులో నాలుగు సంఘాలకు చెందిన 2347 ఉత్పత్తులలో 612, మండవల్లి మండలంలో రెండు డ్వాక్రా సంఘాలకు చెందిన 2586 ఉత్పత్తుల్లో 845 డెలివరీ జరిగాయన్నారు. ఒక్క గ్రూపుకు చెందిన కనకాద్రిపురం గుడ్ హెల్త్ మిల్లెట్స్ ఫుడ్ నుంచి 1480 గాను 709 డెలివరీ పూర్తయినట్లు వివరించారు. శనివారం నాటికి డెలివరీ పూర్తి చేసి గుడ్ హెల్త్ మిల్లెట్స్ ఫుడ్ మొదటి స్థానం సంపాదించుకోవాలని సూచించారు. ఆయా మండలాల్లో మహిళలు రకరకాల వ్యాపారాలు చేస్తుండగా కనకద్రిపురం మహిళలు వారే స్వంతంగా ఆరోగ్యకరమైన ఉత్పత్తులు తయారు చేయటం చిసి అభినందించారు. ఏడాది క్రితం నాటికి ఇప్పటికీ ఉత్పత్తుల రుచి , ప్యాకింగ్ మెరుగయ్యాయని కితాబు ఇచ్చారు. చిరు ధాన్యాల ఆహారం – చింతలు లేని ఆరోగ్యం అనే స్లోగన్ తో తయారు చేస్తున్న వినీల ఎంటర్ ప్రైసెస్ మరింత అభివృద్ధి చెందాలని ప్రాజెక్టు డైరెక్టర్ ఆశాభావం వ్యక్త పరిచారు. జిల్లా మహిళా సమాఖ్య కార్యదర్శి వినీల ఎంటర్ ప్రైసెస్ ఛైర్మన్ తోట కృపామణి ఉత్పత్తుల తయారీ విధానాన్ని ప్రాజెక్టు డైరెక్టర్ కు వివరించారు. ప్రాజెక్టు డైరెక్టర్ వెంట వెలుగు సి.సి గంధం కృష్ణ తదితర్లు పాల్గొన్నారు.

➡️