భోగి మంటల్లో విద్యుత్‌ బిల్లులు దగ్ధం

Jan 13,2025 11:51 #Eluru district

ప్రజాశక్తి – జీలుగుమిల్లి : విద్యుత్ ఛార్జీల పెంపు ను నిరసిస్తూ సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జీలుగుమిల్లి సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో కామయ్య పాలెంలో విద్యుత్ బిల్లులను భోగి మంటల్లో వేసి దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సంధర్బంగా మండల కార్యవర్గ సభ్యులు సిరి బత్తుల సీతారామయ్య మాట్లాడుతూ పెంచిన విద్యుత్ ఛార్జీలను రద్దు చేయాలని, విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియ మానుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పాల్గొన్నారు.

➡️