ప్రజాశక్తి-నూజివీడు టౌన్ : పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని నూజివీడు పట్టణంలో విద్యుత్ బిల్లులను భోగిమంటల్లో వేసి సిపిఎం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి రాజు మాట్లాడుతూ ప్రజలపై విద్యుత్ ఛార్జీలను పెంచుతూ మోయలేని భారం వేసిన 18 వేల కోట్ల రూపాయలను ఉపసంహరించుకోవాలని, కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు, ప్రజలకు ఆర్థిక ఇబ్బందులు కలిగించే స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని, బడుగు బలహీన వర్గాలకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వానికి తెలియజేశారు, ట్రూ ఆప్ చార్జీల పేరుతో వసూలు చేస్తున్న విద్యుత్ చార్జీలను ఉపసంహరించుకోవాలని అన్నారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయని పక్షంలో ప్రజా ఉద్యమ వెలువలో పోరాటాన్ని తీవ్రతలను చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పాల్గొన్నారు.
