ప్రజాశక్తి-కొయ్యలగూడెం : మండల కేంద్రంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్, మినీ వర్కర్స్ సమ్మె అరో రోజుకు చేరుకుంది. ఆరో రోజు నిరసనలో వినూత్నంగా గాంధీ చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుని, ఈ ప్రభుత్వం చేసే అన్యాయం చూడకు, సాధించే వరకు సాగు, ఈ ప్రభుత్వం చెప్పే అసత్యాలు నమ్మకు గెలిచే వరకు పోరాటం ఆపకు, ఆరు రోజులు నుంచి చేస్తున్న, పట్టించుకోని ప్రభుత్వం గురించి మౌనంగానే ప్రశ్నించు అని నినదించారు. ప్రాజెక్ట్ అధ్యక్షులు శివ రత్న కుమురి, పి పద్మజ, జె నాగవేని, అడపా నాగజ్యోతి, సి.హెచ్ సునితరయల్, బొబ్బిలి చిట్టి, కే జ్యోతి, కే మాధవి, పి భాగ్యలక్ష్మి, యమ్ వెంకటలక్ష్మి, యమ్ మంగా,శ్రీదేవి, నుర్జాహన్ తదితరులు పాల్గొన్నారు.