ప్రతిఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలి

ప్రజాశక్తి – కైకలూరు

18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసుకోవాలని కళాకారుల బృందం గ్రామాల్లో అవగాహన కల్పించారు. బుధవారం మండలంలోని కొల్లేరు లంక గ్రామాల్లో ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. ఓటు అనేది భారత రాజ్యాంగం మనకు ఇచ్చిన ఒక హక్కు, ఆ హక్కుని ప్రతిఒక్కరూ కూడా బాధ్యతాయుతంగా నిర్వర్తించాలన్నారు. మనం వేసే ఓటు ఐదేళ్ల మన భవిష్యత్తుతో పాటు రాబోయే తరాల వారి భవిష్యత్తును కూడా నిర్ణయిస్తుందని తెలిపారు. అందుకే ప్రలోభాలకు లొంగవద్దు ప్రాణ సమానమైన ఓటును అమ్ముకోవద్దు అన్నారు. రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కు ఓటు హక్కు 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవాలని తెలిపారు.

➡️