మినీ గోకులాలతో రైతులకు ఆర్థిక భరోసా

మంత్రి కొలుసు పార్థసారథి
ప్రజాశక్తి – ముసునూరు
పాడి రైతులకు ఎంతో అవసరమయ్యే గోకులాలను గత ఐదేళ్ల వైసిపి పాలనలో కేవలం 268 నిర్మిస్తే కూటమి ప్రభుత్వం కేవలం ఆరు నెలల కాలంలోనే 12,500 నిర్మించిందని, ఇది కూటమి ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఆదివారం మండలంలోని సూరేపల్లి గ్రామంలో నిర్మించిన గోకులంను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పశు సంపదను రక్షించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తూ 90 శాతం సబ్సిడీ అందిస్తుందన్నారు. జాతీయ ఉపాధి హామీలో భాగంగా ఈ మినీ గోకులం షెడ్లను నిర్మించారని తెలిపారు. మినీ గోకులాలతో రైతులకు ఆర్థిక బాసట, ఉపాధి లభిస్తుందని అన్నారు. కార్యక్రమంలో పలువురు రైతులు, అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

➡️