డిఎఫ్‌ఒను కలిసిన అటవీశాఖ ఉద్యోగులు

జీలుగుమిల్లి : జిల్లా అటవీశాఖ అధికారిగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన శుభమ్‌ను మంగళవారం జీలుగుమిల్లి అటవీ శాఖ ఉద్యోగుల అసోసియేషన్‌ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిసినట్లు ఆ సంఘం అధ్యక్షుడు కె.రాంబాబు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అటవీ శాఖ అధికారికి పూల మొక్కను అందజేసి అభినందనలు తెలిపారు. డిఎఫ్‌ఒను కలిసిన వారిలో అధ్యక్షులు కె.రాంబాబు, ఉపాధ్యక్షులు వి.ఏసు పండు, జనరల్‌ సెక్రటరీ ప్రసాద్‌, జాయింట్‌ సెక్రటరీ డి.శ్రీను, ట్రెజరర్‌ జి.మారేష్‌ ఉన్నారు.

➡️