ఘనంగా ‘హెల్పింగ్‌ హాండ్స్‌’ వార్షికోత్సవం

ప్రజాశక్తి – నూజివీడు టౌన్‌

నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో ‘హెల్పింగ్‌ హాండ్స్‌’ వారి 15వ వార్షికోత్సవం, మథర్‌ థెరిస్సా జన్మదినం సందర్భంగా మొక్కలు నాటారు. ముఖ్య అతిథులుగా నూజివీడు ట్రిపుల్‌ ఐటీ ఎఒ డాక్టర్‌ లక్ష్మణరావు భగవతి, ఎఫ్‌ఒ బి.శ్రీనాథ్‌, డీన్‌ ఆఫ్‌ అకడమిక్స్‌ ఎన్‌.రత్నాకర్‌ హాజరై మథర్‌ థెరిస్సా చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం హెల్పింగ్‌ హాండ్స్‌ వార్షికోత్సవంను కొత్తగా చేరిన ఎన్‌ 24 బ్యాచ్‌ విద్యార్థులకు వ్యాసరచన, ప్రసంగపు పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తమ సహాయార్థం హెల్పింగ్‌ హాండ్స్‌ చేస్తున్న సేవలను విద్యార్థులు ఎంతో మెచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్‌ హాండ్స్‌ సంస్థ ప్రెసిడెంట్‌ ఎ.బ్రహ్మస్వాములు, జనరల్‌ సెక్రటరీ జె.మధు, జాయింట్‌ సెక్రటరీలు, డాక్టర్‌ సలీంబాబు, డాక్టర్‌ వేణుగోపాల్‌, సీతాపతి, చిరంజీవి పాల్గొన్నారు.

➡️