ప్రజాశక్తి – ముదినేపల్లి
మండలంలోని కొచ్చర్ల-వైవాక ఆర్ అండ్ బి రోడ్డు మరమ్మతుల పనులు చేసేందుకు ఆక్వారైతులు తమ వంతు ఆర్థిక సహకారం అందించారు. ఈ రోడ్డులో ఆక్వా చెరువుల పనులకు వెళ్లడానికి వ్యవసాయ కార్మికులు, చెరువు వద్దకు వెళ్లేందుకు రైతుల అగచాట్లు వర్ణనాతీతం. వైవాక వెళ్లటానికి ప్రధానమైన రహదారిగా కూడా ఎక్కువమంది ఈ రోడ్డును ఉపయోగిస్తారు. ఈ రోడ్డుపై కనీసం కారు, పొలాలకు వెళ్లడానికి ట్రాక్టర్ వెళ్లే పరిస్థితి లేదు. ఈ రోడ్డుపై రాకపోకలు సాగించేందుకు ఆక్వా రైతులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోడ్డు గుండా ద్విచక్ర వాహనాలు సైతం వెళ్లటానికి ఇబ్బందిగా ఉంది. రోడ్డు కింద నుంచి అక్కడక్కడా గుంటలు ఉన్నాయి. ఆదమరిచారా అంతే గుంటలోకి వెళ్లి ప్రమాదం అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు కొచ్చర్ల-పెదతుమ్మిడి ఆర్‌అండ్‌బి రోడ్డు బాగా దెబ్బతినడంతో ప్రజలు, రైతులు ప్రయాణం సాగించేందుకు నానా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గ్రామస్తులు కైకలూరు ఎంఎల్‌ఎ శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో వైవాక ఆక్వా రైతులు రోడ్డు మరమ్మతులకు రూ.10 లక్షలు అందించేందుకు ముందుకు వచ్చి, రోడ్డు మరమ్మతు పనులకు శ్రీకారం చుట్టారు. ఈ రోడ్డు పనులకు ఎంఎల్‌ఎ కామినేని శ్రీనివాస్ ఇటీవల భూమి పూజ నిర్వహించారు. ఆక్వా రైతులు మాజీ దేవస్థాన ఛైర్మన్ అడ్డాల గణపతిరాజు, భగవాన్ రాజు, మోహన్ రాజు, సుబ్బరాజు, నరసింహరాజు, మాజీ సర్పంచి కొత్తపల్లి లక్ష్మిపతిరాజు, వెంకట సత్యనారాయణ రాజు, సూర్యనారాయణ రాజు, వేగిరాజు రామకృష్ణంరాజు, ముదుళ్ల శ్రీనివాసరాజు, మంతెన గణపతిరాజు, శ్రీనివాసరాజు, అల్లూరి శివాజీ రాజు, రామకృష్ణంరాజు, నాగుళ్ల రాఘవులు, శేషగిరి, ఇందుకూరు సోమరాజు, సూర్పరాజు, కూనపరాజు నాగరాజు, గొట్టుముక్కల సోమరాజు, మురళీ కృష్ణంరాజు, శ్రీనివాసరాజు, పుల్లంరాజు, ముదుండి శ్రీనివాసరాజు, వేగేశ్న ప్రసాదరాజు, భగవాన్ రాజు, మట్టా రాంబాబు, బోయిన శ్రీనివాసరావు, నున్న కనకరాజు, నడింపల్లి ధర్మరాజు, కనుమూరి రామకృష్ణంరాజు(జికెఎఫ్), కోసూరి సీతారామరాజు, గాధిరాజు రమేష్‌రాజు, పరాజ్ గొట్టుముక్కల ప్రసాదరాజు, పెన్మెత్స సత్యనారాయణరాజు, కలిదిండి సత్యనారాయణరాజు, చేకూరి చంటిరాజ్, కలిదిండి చిన రామరాజు, చింతల మురళీ, కూసంపూడి నాగరాజు, దాట్ల విజయరాఘవరాజు, కొత్తపల్లి లక్ష్మిపతిరాజు(పండు), సరిపల్లి శ్రీనివాసరాజ్, వేగేశ్న సూర్పరాజు తదితర ఆక్వారైతులు, ఆక్వా రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తాడినాడ బాబు ఆధ్వర్యంలో తమ వంతు విరాళాలు అందించారు. వైవాక గ్రామ ఆక్వా రైతులు తమ సొంత ఖర్చులతో రోడ్డు మరమ్మతు పనులు చేసేందుకు ముందుకు రావడం పట్ల ఎంఎల్‌ఎ కామినేని శ్రీనివాస్ వైవాక గ్రామ ఆక్వా రైతులందరినీ అభినందించారు. ఈ రోడ్డు మరమ్మతు పనులను ఆక్వా రైతులు స్వచ్ఛందంగా చేస్తుండడంతో కొచ్చర్ల, వైవాక గ్రామాల ప్రజలు, రైతులు హర్షం వ్యక్తం చేశారు.