సంక్షేమాభివృద్ధితో జగనన్న ఆదుకున్నారు

Apr 3,2024 22:22

ఎంఎల్‌ఎ అబ్బయ్య చౌదరికి మద్దతు తెలిపిన మండల ఎస్‌సి నాయకులు, కార్యకర్తలు

ప్రజాశక్తి – ఏలూరు టౌన్‌

ఏలూరు రూరల్‌ మండలానికి చెందిన ఎస్‌సి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో భారీ బైక్‌ ర్యాలీగా కొండలరావు పాలెం క్యాంపు కార్యాలయానికి తరలివచ్చి, దెందులూరు ఎంఎల్‌ఎ కొఠారు అబ్బయ్య చౌదరిని మర్యాదపూర్వకంగా కలిసి, రేపటి ఎన్నికల్లో తమ మద్దతు ఇస్తున్నట్లు స్వచ్ఛందంగా ప్రకటించారు. జగనన్న నాయకత్వంలో ఎంఎల్‌ఎ అబ్బయ్య చౌదరి ఏలూరు రూరల్‌ మండల ప్రాంత ప్రజలకు గతంలో ఎన్నడూ చూడని సంక్షేమాభివృద్ధిని అందించారని, వివిధ వర్గాల మధ్య వైషమ్యాలు తొలగించి ఐక్యత తెచ్చారని వారు పేర్కొన్నారు. ఈ ప్రగతిని సుస్థిరం చేసుకోవాలన్న నిర్ణయంతో తామంతా కలిసి ఎంఎల్‌ఎను కలిసి రాబోయే ఎన్నికల్లో ఆయన్ని భారీ మెజారిటీతో గెలిపిస్తామని నాయకులు, కార్యకర్తలు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ అబ్బయ్య చౌదరి ఏలూరు రూరల్‌ మండల నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతూ జగనన్న ఆశీస్సులతో అందరి అభివృద్ధికి పాటుపడుతున్నానన్నారు. ఏ సమస్యలు వచ్చినా తాను పరిష్కరిస్తానని, ఎల్లప్పుడూ అందరికీ అండగా ఉంటానని హామీ ఇస్తూ, మరోసారి దెందులూరు గడ్డ మీద వైసిపి జెండాను ఎగరేద్దామని పిలుపునిచ్చారు. అనంతరం ఎంఎల్‌ఎ నాయకులు, కార్యకర్తలతో కలిసి భోజనం చేశారు.

➡️