ప్రజాశక్తి – నూజివీడు టౌన్
మండలంలోని జంగంగూడెం గ్రామంలోని పొట్లూరి వెంకట చలపతిరావు, కృపావతమ్మ ఐటిఐ కళాశాలలో ఈ నెల 15వ తేదీన జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ మురళీకృష్ణ తెలిపారు. కళాశాలలో ఆయన బుధవారం మాట్లాడుతూ ఈ జాబ్‌మేళాలో వరుణ్ మోటార్స్, వీల్స్ ఇండియా కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారన్నారు. సుమారు 150 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడమే లక్ష్యంగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ జాబ్ మేళాలో పాల్గొనేందుకు అభ్యర్థులు ఇంటర్, ఐటిఐ, డిగ్రీ, పీజీ విద్యార్హతలు కలిగి ఉండి 18 నుంచి 35 ఏళ్ల లోపు వారు అర్హులని తెలిపారు. ఇతర వివరాలకు 8374039719, 9391155228, 9988853335, 8712655686, 8790118349, 8790117279 సంప్రదించాలని తెలిపారు.
