రసవత్తరంగా ఖోఖో పోటీలు

ప్రజాశక్తి – ఉంగుటూరు

కైకరం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి స్కూల్‌ గేమ్స్‌ అండర్‌ 14, 16 బాల, బాలికల ఖోఖో ఎంపికలు మంగళవారం నిర్వహించబడ్డాయి. ఈ ఖోఖో బాలబాలికల ఎంపికలకు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 15 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 700 మంది క్రీడాకారులు, 100 మంది వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారని ఆర్గనైజింగ్‌ అధ్యక్షులు, ప్రధానోపాధ్యాయులు గుళ్ల ప్రసాద్‌ రావు, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ జి.నాగ సుధా తెలియజేశారు. ఈ జిల్లాస్థాయి ఖోఖో ఎంపికల నిమిత్తం ఏర్పాటు చేసిన మూడు కోర్టులలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఉంగుటూరు మండల జెడ్‌పిటిసి కొరిపల్లి జయలక్ష్మి, ఉంగుటూరు ఎంపిపి గంటా శ్రీలక్ష్మి, స్కూల్‌ మేనేజ్మెంట్‌ కమిటీ ఛైర్మన్‌ అల్లూరి జగదీశ్వరి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గ్రామ సర్పంచి సలగాల గోపి, ఎస్‌ఎంసి వైస్‌ ఛైర్మన్‌ ఎస్‌.బలరాం, ఎస్‌ఎంసి కో ఆప్టెడ్‌ సభ్యులు బండారు నాగేశ్వరరావు, జిల్లా స్కూల్‌ గేమ్స్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ కె.అలివేలు మంగమ్మ, ఉంగుటూరు నియోజక వర్గ స్కూల్‌ గేమ్స్‌ కోఆర్డినేటర్‌ ఎమ్‌బిఎల్‌.నారాయణ, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు రమేష్‌ పాల్గొన్నారు. ఈ జిల్లాస్థాయి ఖోఖో ఎంపికలలో అండర్‌-14, బాలురు, బాలికలు అండర్‌-16 బాలురు, బాలికలు నాలుగు కేటగిరీల్లో ఒక్కొక్క కేటగిరీ నుంచి 16 మంది చొప్పున మొత్తం 64 మందిని రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపిక చేశామని, అండర్‌-14 రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలు పల్నాడు జిల్లాలో, అండర్‌-16 రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలు అనకాపల్లిలో జరుగుతాయని చెప్పారు.

➡️