ప్రజాశక్తి – ఉంగుటూరు
మండలంలోని కాకర్లమూడి గ్రామ సర్పంచి కాళ్ల నాగ వెంకట సత్యనారాయణ (నాగ పండు) (48) ఆదివారం రాత్రి ఇంటి వద్దనే మృతి చెందారు. తెలుగుదేశం పార్టీకి చెందిన నాగ పండు గ్రామ సర్పంచిగా అనేక సేవలందించారని పలువురు కొనియాడారు. నాగపండు మృతికి ఉంగటూరు ఎంఎల్‌ఎ ధర్మరాజు, టిడిపి మండల నాయకులు పాతూరి విజయకుమార్, కడియాల రవిశంకర్ సంతాపం తెలిపారు. మండలంలోని పలు గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు నాగపండు మృతదేహాన్ని సందర్శించి తమ సంతాపాన్ని తెలిపి నివాళులర్పించారు. నాగపండు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందారు. పరిస్థితి విషమించి ఆదివారం రాత్రి ఇంటి వద్ద మృతి చెందాడు. ఆయన మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నెలకొన్నాయి. ఎంపిడిఒ జి.రాజ్‌మనోజ్, ఎంపిపి గంటా శ్రీలక్ష్మి, సర్పంచుల ఛాంబర్ మండలాధ్యక్షుడు పుచ్చకాయ విష్ణుమూర్తి సంతాపం తెలిపారు.
