వివాహిత ఆత్మహత్య

Dec 2,2024 07:21 #'suicides', #Eluru district

ప్రజాశక్తి-ఏలూరు స్పోర్ట్స్ : బ్యూటీషియన్ గా పనిచస్తున్న వివాహిత విగతజీవిగా పడి ఉండడానికి గమనించిన భర్త మృతురాలి తల్లిదండ్రులకు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన ఏలూరు నగరంలోని రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఏలూరు రెండో పట్టణ ఎస్సై నాగ కళ్యాణి తెలిపిన వివరాల ప్రకారం… ఏలూరు నగరంలోని ఆర్ఆర్ పేట ప్రాంతానికి చెందిన కాళీ ప్రియాంక 25 బ్యూటిషన్ గా పనిచేస్తూ జీవనాన్ని సాగిస్తుంది. ఆమె భర్త శ్రీకాంత్ ఏలూరు సర్వజన ఆస్పత్రిలో అనస్థీషియా టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున భార్యాభర్తల మధ్య చిన్నపాటి విభేదం తలెత్తింది. ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకుని శ్రీకాంత్ చూసేసరికి ప్రియాంక ఇంట్లో ఫ్యానుకు చున్నితో గురి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఇది గమనించిన అతను వెంటనే ప్రియాంక తల్లిదండ్రులకు రెండో పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు సర్వజన ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు దర్యాప్తు వేగవంతం
ఈ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బర్త్డే ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడా లేదా ఆమె ఆత్మహత్యకు పాల్పడిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసును ఎస్ఐ నాగ కళ్యాణ్ ఏలూరు రెండో పట్టణ సీఐ రమణ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

➡️