ఏఐఎస్ఎఫ్ డిమాండ్
ప్రజాశక్తి-నూజివీడు టౌన్ : అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఏలూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో సోమవారం స్థానిక నూజివీడు పట్టణంలో ఉన్న ప్రభుత్వ బాలికల కళాశాల ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కోశాధికారి ఎం సాయికుమార్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థినిలకు కూడా మధ్యాహ్న భోజనం పథకాన్ని వెంటనే అమలుపరచాలని ఈ సందర్భంగా కోరారు. ముఖ్యంగా ప్రభుత్వ రంగ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు అందరూ కూడా మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చి విద్యను అభ్యసిస్తున్నారు కావున అలాంటి విద్యార్థుల గురించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆలోచించి చర్చించి నిర్ణయం తీసుకోవాలని విద్యార్థుల పక్షాన ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ ఏలూరు జిల్లా కన్వీనర్ శివకుమార్ , నాయకులు లాగు ఆకాష్ , మల్లాది ఆకాష్ మహిళా నాయకులు రాజ్యలక్ష్మి, లోకేశ్వరి తదితరులు పాల్గొన్నారు.