ప్రజాశక్తి-ఉంగుటూరు : ఉంగుటూరు ఎస్సీ బాలికల వసతి గృహం నుండి నారాయణపురం వరకు 1495 మీటర్ల పొడవున రూ.1.06 కోట్ల అంచనా వ్యయంతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించనున్న సిసి అండ్ బిటి రోడ్డుకు ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ మెట్ట ప్రాంతంలోని వారు తహ సిల్దారు కార్యాలయానికి వచ్చేందుకు ఈ దారి ఎంతగానో దోహద పడుతుందన్నారు. అలాగే నారాయణపురం నుండి తల్లాపురం (సిపాయి పుంత) మట్టి రోడ్డును ఆ తారు రోడ్డుగా నిర్మిస్తున్నారు. రైతులకు గ్రామస్తులకు ఎంతగానో ఉపయోగంగా ఉంటుందని కూటమి ప్రభుత్వం రవాణా, మౌలిక సదుపాయాల కోసం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఆయన వెంట వివిధ శాఖల అధికారులు పొంగుటూరు ఎంపీపీ గంకా శ్రీలక్ష్మి, ఉంగుటూరు, నారాయణపురం సర్పంచ్లు బండారు సింధు, దిడ్ల అలకనంద కూటమి నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
