ప్రజాశక్తి – ఏలూరు సిటీ
ఏలూరులోని సత్రంపాడు సెంటర్లో నేరెళ్ల హోండా షోరూమ్ సమీపంలో ఆదివారం ‘నేచురల్స్’ బ్యూటీ సెలూన్‌ను ఏలూరు, దెందులూరు ఎంఎల్‌ఎలు బడేటి రాధాకష్ణయ్య (చంటి), చింతమనేని ప్రభాకర్, ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన ‘నేచురల్స్’ హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ సంస్థ ఏలూరు ఫ్రాంచైజ్ పార్టనర్లు బొప్పన శివన్నారాయణ, కాస్మటాలజిస్ట్ బొప్పన పద్మజాచౌదరి మాట్లాడుతూ తమ ఆధ్వర్యంలో ఏలూరులో ఇది రెండో బ్రాంచి అని చెప్పారు. ఏడేళ్ల క్రితం ఆర్‌ఆర్‌పేటలో మొదటి బ్రాంచ్‌ను ప్రారంభించామన్నారు. వినియోగదారులు ఇచ్చిన ప్రోత్సాహంతో సత్రంపాడులో రెండో బ్రాంచిని ప్రారంభిస్తున్నట్లు ఆమె చెప్పారు. తమ సంస్థ బ్రైడల్ మేకప్‌కు ప్రత్యేకత కలిగి ఉందన్నారు. పురుషులకు వేరుగాను, స్త్రీలకు వేరుగాను సదుపాయాలు కల్పించినట్లు చెప్పారు. అందరికీ అందుబాటులో ఉండే ఫీజులే తాము తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు మార్కెట్‌యార్డు ఛైర్మన్ ఎం.పార్థసారథి, 21వ డివిజన్ కార్పొరేటర్ అన్నపనేని భారతి, 20 డివిజన్ కార్పొరేటర్ గూడూరి ప్రసాద్, భారతి విద్యాసంస్థల అధినేత అన్నపనేని రవికుమార్, ఏలూరు, సత్రంపాడు పరిసర ప్రాంతాల్లోని వ్యాపార ప్రముఖులు, వినియోగదారులు పాల్గొన్నారు.
