నిర్వాసిత భూ వివాదంపై అధికారుల ఆరా

ప్రజాశక్తి – జీలుగుమిల్లి
మండలంలోని పి.అంకంపాలెం రెవెన్యూ పరిధిలోని కొరుటూరు నిర్వాసితులకు 218/3, 221 సర్వే నెంబర్లలోని పలువురికి సుమారు 21 ఎకరాల ఆర్‌అండ్‌ఆర్‌ భూములను కేటాయించారు. ఆ భూముల్లో పామాయిల్‌ మొక్కలతో పాటు వేరుశనగ పంటను వేశారు. ఆ భూముల్లోకి స్థానిక గిరిజనులు కొంతమంది వెళ్లి భూములపై మాకు హక్కులు ఉన్నాయని ఆయిల్‌ పామ్‌ మొక్కలను డ్రిప్‌ పరికరాలను, ధ్వంసం చేశారు. దీనిపై బాధితులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సిఐ వెంకటేశ్వరరావు, ఇన్‌ఛార్జి తహశీల్దార్‌ సందీప్‌, ఎస్‌ఐ నవీన్‌కుమార్‌ అక్కడికి చేరుకుని ఇరు గ్రూపులవారితో మాట్లాడారు. స్థానిక గిరిజనుల హక్కులపై ప్రశ్నించగా ఆ భూములకు సంబంధించి తమ దగ్గర హక్కు పత్రాలు ఉన్నాయని తెలపగా వాటిని తీసుకొని కార్యాలయానికి రావాలని తెలిపారు.

➡️