ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలి

జెడ్‌పి చైర్‌పర్సన్‌ పద్మశ్రీ
ప్రజాశక్తి – ఏలూరు సిటీ
గ్రామాల్లో ప్రజలకు అధికారులు అందుబాటులో ఉంటూ కార్యాలయాల పనితీరు మరింత మెరుగు పరిచేలా పర్యవేక్షణ చేయాలని ఉమ్మడి జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పద్మశ్రీ అన్నారు. మండల పరిషత్‌ అధికారులు తమ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని తెలిపారు. జిల్లా పరిషత్‌ కార్యాలయంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని మండల పరిషత్‌ అధికారులతో శుక్రవారం ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె జిల్లా పరిషత్‌లో మంజూరైన పనుల ప్రగతి, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పండుగ పనుల ప్రగతిని సమీక్షించారు. పనులపై ఆడిట్‌ జరిపించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ ముఖ్యకార్యనిర్వాహణ అధికారి కెఎస్‌ఎస్‌.సుబ్బారావు, ఉపముఖ్యకార్యనిర్వాహణ అధికారి భీమేశ్వర్‌, పశ్చిమ గోదావరి జిల్లా ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరింగ్‌ ఎస్‌.శ్రీనివాస్‌, జిల్లా ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరింగ్‌ రమణమూర్తి, డ్వామా పీడీ వెంకట సుబ్బారావు పాల్గొన్నారు.

➡️