కలిదిండి పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌పి ప్రతాప్ శివకిషోర్ వార్షిక తనిఖీలు
ప్రజాశక్తి – కలిదిండి
పెండింగ్ కేసుల దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేయాలని ఎస్‌పి కె.ప్రతాప్‌శివకిషోర్ ఆదేశించారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఆయన శనివారం వార్షిక తనిఖీ నిర్వహించారు. రికార్డులను పరిశీలించారు. స్టేషన్‌కు వచ్చే బాధితుల పట్ల మర్యాదపూర్వకంగా నడుచుకుని వారి సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కార దిశగా చర్యలు చేపట్టాలని స్టేషన్ సిబ్బందికి సూచించారు. స్టేషన్ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని సూచిస్తూ మొక్కను నాటారు. రానున్న శివరాత్రి పండుగ నేపథ్యంలో స్థానిక శ్రీ పాతాళ భోగేశ్వర స్వామి ఆలయం వద్ద జరిగే ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు.