అనుమతులు తప్పనిసరి

Oct 28,2024 12:12 #Eluru district

ప్రజాశక్తి-నూజివీడు టౌన్ : రానున్న దీపావళి సందర్భంగా బాణసంచా దుకాణదారులు తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతులు తీసుకోవాలని  తెలిపారు. నూజివీడు పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో దీపావళి సందర్భంగా చట్టానికి వ్యతిరేకంగా ఎవరైనా అనుమతి లేకుండా బాణసంచా ఇళ్లల్లో షాపులలో జన సముదాయాల మధ్య గొడవలలో నిల్వ చేసిన లేదా లైసెన్స్ లేకుండా అనధికార విక్రయాలు జరిపిన, బాణసంచా విక్రయించే దుకాణదారులు పోలీసుల సూచనలు నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించకపోయినా లైసెన్స్ కలిగిన వారు దీపావళి సామాగ్రి ఉన్న ప్రదేశాలలో ఫైర్ సేఫ్టీ కచ్చితంగా పాటించాలని చట్టాన్ని గౌరవించకుండా ఉల్లంఘించిన అటువంటి వారిపై చట్టపరంగా జిల్లా ఎస్పీ, డీఎస్పీ, ఆదేశాలతో కఠిన చర్యలు తీసుకుంటామని నూజివీడు పట్టణ సీఐ సత్య శ్రీనివాస్ తెలియజేశారు.

➡️