తహశీల్దార్ పురుషోత్తమ శర్మ
ప్రజాశక్తి – ముసునూరు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీ సర్వే ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనసాగించాలని మండల రెవెన్యూ తహశీల్దార్ జి.పురుషోత్తమ శర్మ అన్నారు. గురువారం మండల కేంద్రమైన ముసునూరు రెవెన్యూ కార్యాలయంలో విఆర్‌ఒలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ పురుషోత్తమ శర్మ మాట్లాడుతూ గత ప్రభుత్వం చేపట్టిన రీ సర్వే మరలా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టారన్నారు. మిగిలిపోయిన గ్రామాల్లో రీ సర్వే కొనసాగించే విధంగా ఆదేశాలు వచ్చాయని, గ్రామాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతులకు అనుకూలంగా రీ సర్వే నిర్వహించాలన్నారు. గతంతో పోల్చుకుంటే ఈసారి ఒక్కొక్క గ్రామంలో 60 రోజులకుపైగా ఈ సర్వే నిర్వహించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలియజేశారు.