ఆసన్నగూడెం-బాధరాల రోడ్డుకు మోక్షం

చింతలపూడి: చింతలపూడి నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా నియోజకవర్గ ఎంఎల్‌ఎ సొంగ రోషన్‌ కుమార్‌ పనిచేస్తున్నారని లింగపాలెం టిడిపి మండల అధ్యక్షులు గరిమళ్ల చలపతిరావు అన్నారు. లింగపాలెం మండలంలో ఆసన్నగూడెం నుంచి భాదరాల సీసీ రోడ్ల నిర్మాణం మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 27 సంవత్సరాలుగా ఆసన్నగూడెం నుంచి బాధరాల వరకూ ఉన్న రోడ్డుకు ప్రభుత్వాలు మారినా, మంత్రులు మారినా, ఎంఎల్‌ఎలు మారినా రోడ్డుకు మాత్రం మోక్షం కలగలేదన్నారు. తరాలు మారినా రోడ్లకు మాత్రం వరాలు లేవు కానీ ముఖ్యంగా ఆసన్నగూడెం, పోలాసిగూడెం, బాధరాలలో ఉన్న ప్రజలు కష్టాలను గుర్తించి ఎంఎల్‌ఎ సొంగ రోషన్‌ కుమార్‌ ఆసన్నగూడెం నుంచి బాధరాల వరకు సిమెంట్‌ రోడ్డుకు రూ.కోటి 80 లక్షలు శాంక్షన్‌ చేసి శంకుస్థాపన కూడా జరిగిందని తెలిపారు. బాధరాల సర్పంచి బొల్లినేని శ్రీనివాసరావు, నియోజకవర్గ యువత అధ్యక్షులు నత్త నాగేంద్ర పాల్గొన్నారు.

➡️