ప్రజాశక్తి – ఏలూరు అర్బన్
భారతీయ విజ్ఞాన మండలి, విజ్ఞాన భారతి, సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి సంయుక్త ఆధ్వర్యంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ వారి స్పేస్ ఆన్ వీల్స్ బస్సు ప్రదర్శనను స్థానిక సర్ సిఆర్.రెడ్డి పబ్లిక్ స్కూల్ ఆవరణలో జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.అబ్రహం ప్రారంభించారు. ఏలూరు డివిజన్ పరిధిలోని వివిధ ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలలు, కళాశాలలకు చెందిన 3,394 మంది విద్యార్థులు ఈ ప్రదర్శనను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్పేస్ రంగోలి, చిత్రాలేఖనం పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు.
