ప్రజాశక్తి – ఉంగుటూరు
శాఖాహారం, మితా హారం, క్షమశిక్షణతో డైట్ కంట్రోల్‌తో నిండు ఆరోగ్యంతో 103 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు ఈ శతాధిక వృద్ధులు. వచ్చే ఏఫ్రిల్ నాటికి 104వ సంవత్సరంలోకి అడుగు పెట్టనున్న ఉంగుటూరు మండలం నారా యణపురానికి చెందిన విద్యాదాత, భూస్వామి అప్పసాని శేషగిరిరావు నేటి తరానికి ఆదర్శనీయమని మాజీ సర్పంచి, తెలుగు మహిళా టిడిపి నాయకురాలు అక్కిన నాగమణి అన్నారు. అప్పసాని శేషగిరిరావు ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా మహిళలకు, చిన్నారులకు ముగ్గుల పోటీలు, సంప్రదాయ పండుగ పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు. శేషగిరిరావు సంతానం దేశ విదేశాల్లో వివిధ రంగాల్లో స్థిరపడ్డారు. 2018లో నారాయణపురాన్ని దత్తత తీసుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలు, విద్యాభివృద్ధికి ఆర్థిక సాయం తదితర సేవా కార్యక్రమాలు చేసిన ఈ కుటుంబానికి గ్రామస్తులు అభినందనలు తెలిపారు.
