పాఠశాలకు కుర్చీలు, ఫ్యాన్లు వితరణ

ప్రజాశక్తి – ఆగిరిపల్లి
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని కుశలవ ఇండిస్టీస్‌ ఎమ్‌డి.రామకృష్ణ ప్రసాద్‌ సతీమణి చుక్కపల్లి సుధా అన్నారు. మండల పరిధిలోని ఈదర జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ ప్లస్‌కు ఆమె చుక్కపల్లి ఛారిటబుల్‌ ట్రస్టు తరపున 40 కుర్చీలు, 20 ఫ్యాన్‌లతో పాటు సౌండ్‌ సిస్టంను వితరణగా అందించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు సందిపాము శారద మాట్లాడుతూ దాతలు అందించిన సహాయ సహాకారాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలన్నారు.

➡️