ప్రజాశక్తి – ముసునూరు
అంగన్వాడీ కేంద్రాల్లో బాల బాలికలకు పౌష్టికాహారం మెనూ ప్రకారం అందించాలని సూపర్‌వైజర్ కె.రాజ్యలక్ష్మి అన్నారు. మండల కేంద్రమైన ముసునూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంగన్వాడీ కార్యకర్తలకు, ఉపాధ్యాయులకు పోషణ్ బి, పడాయి బి కార్యక్రమం ఐసిడిఎస్ సూపర్‌వైజర్ ధనలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లు పిల్లలకు సంపూర్ణ నాణ్యమైన ప్రాథమిక విద్యను అందించాలని, పిల్లల్లో సమగ్ర అభివృద్ధి కోసం ప్రీ స్కూల్ సరైన విద్యను అందించడం అంగన్వాడీ కేంద్రాల్లో నాణ్యతతో కూడిన ఆహారంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పన, ఆట పరికరాల ఏర్పాటు, పలు అంశాలపై అవగాహన శిక్షణ ఇచ్చారు. మండలం పరిధిలోని 16 గ్రామాల అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.