ఎంఎల్‌ఎ పత్సమట్ల ధర్మరాజు
ప్రజాశక్తి – ఉంగుటూరు
ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక సదుపాయాల కల్పనకు వాణిజ్య బ్యాంకులు సైతం భాగస్వాములు కావడం అభినందనీయమని ఉంగుటూరు ఎంఎల్‌ఎ పత్సమట్ల ధర్మరాజు అన్నారు. ఎస్‌బిఐ నారాయణపురం శాఖ కోఆపరేటివ్ సోషల్ రెస్పాన్స్‌బిలిటి(సిఎస్‌ఆర్) కింద సుమారు రూ.5 లక్షలతో నారాయణపురం కొబ్బరితోట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు విద్యాసామగ్రి అందజేశారు. బుధవారం గ్రామ సర్పంచి దిడ్ల అలకనంద అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ఎంఎల్‌ఎ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కంప్యూటర్లు, టేబుల్స్, కుర్చీలు, వంట పాత్రలు తదితర మౌళిక సదుపాయాలను కల్పించారు. ఆర్‌బిఒ ప్రసాద్, ఎల్‌కెఎంవి నోరి, బ్రాంచ్ మేనేజర్ కృష్ణచైతన్య, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.