మహోన్నత వ్యక్తి పొట్టి శ్రీరాములు

Mar 16,2025 21:17

ఆయన త్యాగం చిరస్మరణీయం
జయంతి సందర్భంగా నివాళులర్పించిన కలెక్టర్‌ వెట్రిసెల్వి
ప్రజాశక్తి – ఏలూరు
అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయమని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి అన్నారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆదివారం స్థానిక కలెక్టరేట్‌ గౌతమి సమావేశ మందిరంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి కలెక్టర్‌ వెట్రిసెల్వి, జాయింట్‌ కలెక్టర్‌ పి.ధాత్రిరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ వెట్రిసెల్వి మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరంలో శ్రీరాములు నిస్వార్థ పోరాటయోధునిగా గాంధీజీ నుంచి ప్రశంసలు అందుకున్నారన్నారు. తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన చేసిన ప్రాణత్యాగంతో రాష్ట్రం ఏర్పడిందన్నారు. దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు అదే పునాది అయ్యిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు, బిసి కార్పొరేషన్‌ ఇడి ఎన్‌.పుష్పాలత, సెట్‌వెల్‌ సిఇఒ కె.ప్రభాకరరావు, డిఆర్‌డిఎ పీడీ ఆర్‌.విజయరాజు, డిఎంహెచ్‌ఒ మాలిని, డిపిఆర్‌ఒ ఆర్‌విఎస్‌.రామచంద్రరావు, పలువురు అధికారులు, కలెక్టరేట్‌ సిబ్బంది పాల్గొన్నారు.

➡️