నిరాశ్రయులైన రెండు కుటుంబాలు
ప్రజాశక్తి – బుట్టాయగూడెం
మండలంలోని అంత ర్వేదిగూడెం గ్రామంలో అగ్ని ప్రమాదంలో తాటాకిల్లు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో రెండు గిరిజన కుటుంబాల వారు నిరాశ్రయులయ్యారు. సర్వం కోల్పోయిన తమను ఆదుకోవాలని బాధితులు చోడెం రాంపండు, దీపిక కోరుతున్నారు. రాంపండు, దీపిక కుటుంబాలు ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నాయి. ఈ క్రమంలో శనివారం వారు పొలం పనులకు వెళ్లగా అగ్నిప్రమాదం సంభవించి తాటాకిల్లు పూర్తిగా దగ్ధమైంది. ఇంట్లోని ఆధార్ కార్డులు, పొలం పట్టాదారు పాస్ పుస్తకాలు, రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, రూ.50 వేల, సామగ్రి, నిత్యావసర సరుకులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. సర్వం కోల్పోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని, ఇంటిని మంజూరు చేయాలని, మంటల్లో కాలిపోయిన అన్ని పత్రాలను పొందే విధంగా చర్యలు తీసుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు. అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలను సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మొడియం నాగమణి, సిపిఎం మండల కార్యదర్శి తెల్లం రామకృష్ణ, గిరిజన సంఘం మండలాధ్యక్షులు పోలోజు నాగేశ్వరరావు పరామర్శించారు.
