సత్కరించిన కలెక్టర్, జెడ్‌పి చైర్‌పర్సన్
ప్రజాశక్తి – ఏలూరు
స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో భాగంగా పలువురు పారిశుధ్య కార్మికులను కలెక్టర్ కె.వెట్రిసెల్వి, జెడ్‌పి చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ పారిశుధ్య కార్మికుల సేవలు ఎనలేనివన్నారు. జెడ్‌పి చైర్‌పర్సన్ పద్మశ్రీ మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులను ప్రతిఒక్కరూ గౌరవించాలని వారి అభివృద్ధికి సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి డి.పుష్పమణి, జెడ్‌పి సిఇఒ కెఎస్‌ఎస్.సుబ్బారావు, డిపిఒ శ్రీనివాస విశ్వనాధ్, మున్సిపల్ కమిషనర్ ఎన్.భానుప్రతాప్ పాల్గొన్నారు.