పోలవరం ఎంఎల్‌ఎ చిర్రి బాలరాజు
ప్రజాశక్తి – పోలవరం
ఈ నెల 16వ తేదీన సిఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వస్తున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని ఎంఎల్‌ఎ చిర్రి బాలరాజు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడుతూ సిఎం పర్యటనా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులంతా సమన్వయంతో పని చేయాలన్నారు. ఆయన వెంట జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, కార్యదర్శి గడ్డమణుగు రవికుమార్, జిల్లా సంయుక్త కార్యదర్శి పాదం నాగకృష్ణ, మండలాధ్యక్షులు గునపర్తి చిన్ని, బుట్టాయగూడెం మండలాధ్యక్షులు మెట్ట బుచ్చిరాజు, వైస్ ప్రెసిడెంట్ తెలగంశెట్టి రాము, జల వనరుల శాఖ అధికారులు ఉన్నారు.
