మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టాలి

నవజీవన్‌ బాల భవన్‌ ప్రోగ్రాం మేనేజర్‌ శేఖర్‌ బాబు

ప్రజాశక్తి – ఆగిరిపల్లి

యువత భవిష్యత్‌ను నిర్వీర్యం చేస్తున్న మాదక ద్రవ్యాల వినియోగాన్ని, సోషల్‌ మీడియా దుర్వినియోగాన్ని ఆరికట్టడానికి ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకొని నివారించాలని నవజీవన్‌ బాల భవన్‌ ప్రోగ్రాం మేనేజర్‌ గోళ్లమూడి శేఖర్‌ బాబు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని సగ్గూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా వర్కర్లకు, ఆరోగ్య కార్యకర్తలకు మత్తు పదార్థాల వినియోగం, సోషల్‌ మీడియా దుర్వినియోగంపై వర్క్‌షాప్‌ నిర్వహించారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సగ్గూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి పి.మంజులాదేవి, నీతోడు మానసిక వికాస కేంద్రం జోనల్‌ కో-ఆర్డినేటర్‌ డి.వెంకటేశ్వరరావు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️