జ్యోతిరావు పూలేకు ఘన నివాళులు 

Nov 28,2024 12:10 #Eluru district

ప్రజాశక్తి-నూజివీడు టౌన్ : నూజివీడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీ నాయకుల, కార్యకర్తలు మహిళలు ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్బంగా తెలుగుదేశం పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి పి, నాగరాజు మాట్లాడుతూ జ్యోతిరావు పూలే గారు గొప్ప ఆదర్శవంతుడని గొప్ప సంఘ సంస్కర్త అని అన్నారు. ఆనాటి కాలంలో దేశాన్ని పట్టి పీడిస్తున్న అంటరాని తనాన్ని రూపు మాపిన గొప్ప నాయకుడని కొనియాడారు అంటరాని తనం వెట్టి సాకిరీ విధానం వితంతు వివాహము, మహిళలపై వివక్షత పురుషుల ఆధిక్యత పై అనేక ఉద్యమాలు చేసి అనేక సంఘ సంస్కరణలు తీసుకొచ్చిన మహానుభావుడని అన్నారు. అలాంటి మహానుబావుణ్ణి అందరం గుర్తుచేసుకొని నివాళులు అర్పించడం మన కర్తవ్యం అన్నారు ఆయన దేశానికి చేసిన సేవలను మనం ఎన్నడూ మరువకూడదన్నారు ఆయన చూపిన బాటలో నడవాలని ఆయన అడుగుజాడల్లో నడవాలని ఆయన దేశానికి చేసిన సేవ సంఘ సంస్కరణలు ఎన్నడూ మరువకూడదని ఆయన చూపిన ఆదర్శాల్లో నడవాలని గుర్తు చేశారు. పూలే దేశంలోనే మొట్ట మొదటిగా తన భార్య సావిత్రి భాయ్ పూలేను చదివించి మొదటి ఉపాధ్యాయురాలుగా దేశానికి అందించిన ఘనత పూలేకే దక్కుతుందని అన్నారు. అంతేకాక తమ భార్య సావిత్రి భాయ్ పేరున ఒక పాఠశాల నిర్మించి మహిళలకు విధ్యనందించిన ఘనత ఆదర్శ దంపతులకే దక్కుతుందన్నారు. అలాంటి మహానుభావునికి నివాళులు అర్పించడం మనందరి కర్తవ్యం అన్నారు.

➡️