7న మెడికల్‌ రిప్స్‌ చలో విజయవాడ మహాధర్నా

ఏలూరు అర్బన్‌ : ప్రజలకు అత్యవసర, నిత్యావసర మందులపై జిఎస్‌టిని ఎత్తివేయాలని, ఫార్మా రంగంలో పనిచేస్తున్న మెడికల్‌ రిప్రజెంటేటివ్స్‌కు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ నవంబర్‌ 7వ తేదీన విజయవాడలో మహాధర్నా నిర్వహిస్తున్నట్లు ఎపి సేల్స్‌ మెడికల్‌ రిప్రజెంటిటీ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి వివిఎన్‌.ప్రసాద్‌ తెలిపారు. ఈమేరకు మంగళవారం సాయంత్రం స్థానిక సిఐటియు కార్యాలయంలో యూనియన్‌ వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫార్మా రంగంలో సేల్స్‌ రిప్రజెంటేటివ్స్‌కు కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజలకు అత్యవసర, నిత్యవసర మందుల ధరలు అందుబాటులో ఉండేలాగా మందులపై జిఎస్‌టిని ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. ఈ ధర్నాలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ బ్రాంచి అధ్యక్షులు బివి.సత్యనారాయణ, ఉమా మహేష్‌, వేణు పాల్గొన్నారు.

➡️