జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్
ప్రజాశక్తి – ఏలూరు అర్బన్
వన్‌స్టాప్ సెంటర్ అందించే సేవలపైన విస్తృత ప్రచారం చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ తెలిపారు. సూచించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.పురుషోత్తంకుమార్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలోని వన్ స్టాప్ సెంటర్‌ను రత్నప్రసాద్ శుక్రవారం సందర్శించారు. వన్‌స్టాప్ సెంటర్‌లో నిర్వహిస్తున్న రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఫిర్యాదులను ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను అనుసరించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే వన్‌స్టాప్ సెంటర్‌లో ఉన్న బాధితులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. బాధితులకు అవసరమైన పక్షంలో ఉచిత న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెంటర్ అడ్మిన్ నిర్మల పాల్గొన్నారు.
