నూజివీడు ఏరియా ఆసుపత్రిని సందర్శించిన వరల్డ్‌ బ్యాంక్‌ టీమ్‌

ప్రజాశక్తి – నూజివీడు టౌన్‌
నూజివీడు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని వరల్డ్‌ బ్యాంక్‌ టీం సోమవారం సందర్శించింది. ఆసుపత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించి, చికిత్సలు అందించే వివరాలను అడిగి తెలుసుకున్నారు. వరల్డ్‌ బ్యాంక్‌ టీమ్‌లో ఐసిఆర్‌ ఆధర్‌ జాయి డి బేయర్‌, టెక్నికల్‌ కన్సల్టెంట్‌ ఎస్‌.కృష్ణ, డాక్టర్‌ సునీత ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నరేంద్ర సింగ్‌, వైద్యులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

➡️