ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత

Jun 10,2024 18:28 #employ

 

తిరువూరు శాసనసభ్యులు కొటికలపూడి శ్రీనివాసరావు
తిరువూరు : ఉద్యోగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తిరువూరు శాసనసభ్యులు కొటికలపూడి శ్రీనివాసరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ నాల్గో తరగతి ఉద్యోగుల సంక్షేమ సంఘం, ఎపి నాల్గో తరగతి ఉద్యోగుల సంఘం హౌస్‌ బిల్డిండ్‌ సొసైటీ పాలకమండలి ఆధ్వర్యంలో తిరువూరులోని కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీనివాసరావును నాయకులు కలిసి ఎన్నికల్లో గెలుపొందినందుకు అభినందనలు తెలిపారు. శాలువాతో సత్కరించి పూలబకేను అందజేశారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సొసైటీ అధ్యక్షులు మహ్మద్‌ రఫీ మాట్లాడుతూ గతంలో టిడిపి ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చారని గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా ఆ దిశగా కృషిచేయాలని సూచించారు. ఉద్యోగుల సంక్షేమం, గృహవసతి కల్పన, ఇతర సంక్షేమ పథకాల వర్తింపుపై దృష్టిసారించాలని విజ్ఞప్తిచేశారు. దీనికి ఎమ్మెల్యే కొటికలపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజలకు నిరంతరం సేవలు చేసే ఉద్యోగులు, తమ యావత్‌జీవితం ప్రజల సంక్షేమం కోసం పాటుపడిన విశ్రాంత ఉద్యోగుల సంక్షేమానికి తమ శక్తివంచన లేకుండా ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్‌ ప్రెసిడెంట్‌ కె.సాయిబాబు, డైరెక్టర్లు ఎన్‌.విలియం, జి.విశ్వేశ్వరరావు, నాగారపు నాగేశ్వరరావు తదితరులు పాల్గన్నారు.

➡️