ప్రజాశక్తి -తగరపువలస : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టనున్న పనులను వినియోగించుకోవాలని భీమిలి మండలం టి.నగరపాలెం సర్పంచ్ పొట్నూరు ఛాయా గౌతమి ఉపాధి కూలీలను కోరారు. స్థానిక గ్రామ సచివాలయంలో బుధవారం ఉపాధి కూలీలకు సమావేశం నిర్వహించారు. ఇటీవల గ్రామ సభలో గుర్తించిన పనుల వివరాలను ఆమె వివరించారు. వలసల నివారణకు ఉపాధి పథకం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. పంచాయతీ వార్డు సభ్యులు పూసర్ల రామారావు మాట్లాడుతూ, ఇరిగేషన్ కాల్వ ఆక్రమణకు గురైందని, ఇందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఎంపిటిసి సభ్యులు పల్లా నీలిమ, మాజీ సర్పంచ్ పి.రాము, వార్డు సభ్యులు పి.అప్పారావు, నరేంద్ర, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.
