ఇసుకను సరఫరా చేస్తేనే కార్మికులకు ఉపాధి

Oct 8,2024 23:46

ప్రజాశక్తి – అచ్చంపేట : ఉచిత ఇసుక సరఫరాను సరళతరం చేసి భవన కార్మికులకు పనులు కల్పించాలని సిపిఎం మండల కార్యదర్శి ఆర్‌.వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు తహశీల్దార్‌ శ్రీనివాసయాదవ్‌కు మంగళవారం వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ట్రాక్టర్‌ ఇసుక గ్రామాల్లో రూ.6 వేలకు అమ్ముతున్నారని, భవన నిర్మాణ పనులు నిలిచి కార్మికులు ఉపాధి కోల్పోయారని, ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నారని చెప్పారు. కార్మికులకు నిలిచిన సంక్షేమ పథకాలను అమలు చేయాలని, భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వడంతోపాటు పాత కార్డులను రెన్యువల్‌ చేయాలన్నారు. వినతిపత్రం ఇచ్చినవారిలో సిపిఎం నాయకులు జి.రవికుమార్‌, రైతు సంఘం నాయకులు షేక్‌ హసన్‌, కేకే రెడ్డి, డిబిఆర్‌ఎఫ్‌ మండల కార్యదర్శి ఎస్‌.అశోక్‌, విఆర్‌ఎల సంఘం మండల అధ్యక్షులు కె.సుబ్బారావు ఉన్నారు.

➡️