కుచించక పొయిన గుడ్లూరు మెయిన్ బజార్
గుడ్లూరు మెయిన్ బజారులో ఆక్రమణలు
ప్రజాశక్తి-గుడ్లూరుగుడ్లూరు మెయిన్ బజారుకు ఇరువైపులా వ్యాపారులు ఇష్టారాజ్యంగా ఆక్రమించుకొని భవనాలు నిర్మించడంతో 40 నుంచి 60 అడుగులు వెడల్పు ఉండాల్సిన బజారు రోడ్డు 20 అడుగులకి కుంచించుకుపోయింది. కొన్ని సెంటర్లలో 27 అడుగులు కూడా లేకపోవడంతో వందలాది వాహనాలు ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుపోతున్నాయి. గంటల తరబడి ప్రజలు అవస్థలు పడాల్సిన దుస్థితి ఏర్పడింది. వ్యాపారులు కొందరు పోటా పోటీగా సైడు కాలువలను సైతం ఆక్రమించి భవనాలు నిర్మించడంతో వాహనదారుల అవస్థలు పడుతున్నారు. స్థానిక బస్టాండ్ సెంటర్ నుంచి శివాలయం వరకు అర కిలోమీటర్ దూరం రహదారి స్థలాన్ని ఆక్రమించుకొని వ్యాపారా లావాదేవీలు జరుపుతున్నారు. గుడ్లూరు మండల కేంద్రానికి సమీపంలో ఉన్న 10 గ్రామాల ప్రజలు నిరంతరం నిత్యావసర వస్తువుల కోసం గుడ్లూరు చేరకుని వస్తువులు ,కూరగాయలు కొనుగోలు చేస్తారు. వందలాది మంది రైతులు ఎరువులు ,పురుగు మందుల కోసం మెయిన్ బజార్లో ఉన్న షాపులు దగ్గర కొనుగోలు చేయాల్సి వస్తుంది. దుస్తుల దుకాణాలు సైతం మెయిన్ బజారర్‌లోనే ఉండటంతో వినియోగదారులతో నిరంతరం రద్దీగా ఉంటుంది. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వివిధ రకాల దుకాణాలు వినియోగదారులతో కిక్కిరిసి ఉండడంతో రహదారిలో ద్విచక్ర వాహనాలు ఆటోలు కార్లు ఎక్కడికక్కడ నిలిచి పోవటం వల్ల తరచుగా ట్రాఫిక్ జామ్ జరుగుతోంది. ఆక్రమణలు తొలగించాలని అనేకసార్లు మండల ప్రజలు డిమాండ్ చేయడంతో అధికారులు ఎట్టకేలకు రంగంలో దిగి రోడ్డుకి ఇరువైపులా మార్కింగ్ వేశారు. కనీసం 30అడుగులు మెయిన్ బజార్ ఉండే విధంగా అధికారులు ప్రయత్నాలు చేస్తూ ఉండగానే కొందరు వ్యాపారులు కోర్టు నుంచి స్టేట్ తీసుకురావడంతో ప్రస్తుతానికి రోడ్డు విస్తరణపనులు ఆగిపోయాయి. దీంతో ఆక్రమణదారులకి మరింత అవకాశం ఎక్కడ ఉందో మరి అంత ముందుకు వచ్చి నిర్మాణాలు చేపట్టడంతో పాదచార్లు సైతం అవస్థలు పడుతున్నారు. ఇటీవల ప్రజా ప్రతినిధులు కార్లు సైతం ట్రాఫిక్ లో చిక్కుబడిపోవడంతో చిరు వ్యాపారులు తోపుడుబండ్లతో జీవనం సాగిస్తున్న వారిపై పోలీసులు ప్రతాపం చూపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు అధికారులు సమిష్టిగా గుడ్లూరు మెయిన్ బజార్ లో ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు పూలుకోవాలని సిపిఎం నాయకులు జి వెంకటేశ్వర్లు ,మద్దిశెట్టి జాలయ్య దామా కష్ణయ్య, పొట్లూరు రామచంద్రయ్య ,కే వెంకయ్య ప్రజాసంఘాల నాయకులు అధికారులకు ఈ విజ్ఞప్తి చేస్తున్నారు.
