ప్రజాశక్తి -మార్కాపురం రూరల్ : భూసారాన్ని పెంచేందుకు సేంద్రీయ ఎరువులు ఎంతగానో ఉపయోగ పడతాయని ఎఒ దేవిరెడ్డి శ్రీనివాసులు తెలిపారు. మండల పరిధిలోని గజ్జలకొండ, నాయుడుపల్లిలో పొలం పిలుస్తోంది నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఒ కంది పంటను పరిశీలించారు. అనంతరం ఎఒ మాట్లాడుతూ రబీ 2024 -25 సీజన్‌లో ప్రధాన మంత్రి ఫసల్ బీమా పథకంలో భాగంగా పంటలకు బీమా చేయించుకోవాలన్నారు. హెచ్‌ఒ రమేష్ మాట్లాడుతూ ఉద్యానవన శాఖ పండ్ల తోటల పెంపకానికి అందిస్తున్న రాయితీల గురించి రైతులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో సిబ్బంది జయంతి, నవీన్, రైతులు తదితరులు పాల్గొన్నారు. కొండపి : మండల పరధిలోని కె.ఉప్పలపాడు, చినవెంకన్న పాలెం గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఒ డి. విజయ కుమార్ మాట్లాడుతూ 25 శాతం సబ్సిడీతో శనగ విత్తనాలు అందజేస్తున్నట్లు తెలిపారు. విత్తనాలు కావాల్సిన రైతులు రైతు సేవా కేంద్రాల్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. రబీ 2024-25 సీజన్‌లో పంటలు సాగు చేసిన రైతులు తప్పని సరిగా ఈ క్రాప్ నమోదు చేయించుకోవాలన్నారు. శనగ, వరి, మిరప పంటలు సాగు చేసే రైతులు తప్పనిసరిగా పంటల బీమా ప్రీమియం చెల్లిం చాలన్నారు. పశువైద్యుడు డాక్టర్ పేరయ్య మాట్లాడుతూ పశువులకు బీమా పథకం క్రింద రూ.398 చెల్లిస్తే మూడు సంవత్సరాల పాటు రూ.30,000 బీమా వర్తిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు, పశుసంవర్థక సహాయకులు గ్రామ రైతులు తదితరులుపాల్గొన్నారు.బేస్తవారిపేట : రబీ సీజన్‌లో పంటలు సాగు చేసిన రైతులు తప్పనిసరిగా పంట బీమా చేయించుకోవాలని ఎఒ జక్కం మెర్సీ తెలిపారు. మండల పరిధిలోని బస్సునపల్లి గ్రామంలో పొలం పిలుస్తోంది నిర్వహించారు. తొలుత ఎఒ రైతులతో కలిసి కంది పంటను పరిశీలించారు. కంది పంటలో తెగుళ్ల నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పట్టు పరిశ్రమశాఖ ఫీల్డ్ అసిస్టెంట్ డివి.శివరామయ్య, గ్రామ వ్యవసాయ సహాయకుడు ప్రతాపరెడ్డి, రైతులు పాల్గొన్నారు.గిద్దలూరు రూరల్ : మండల పరిధిలోని గడికోట,ఆదిమూర్తిపల్లె గ్రామాల్లో ఎఒ వై. విజయ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఒ మాట్లాడుతూ 2024-25 రబీ సీజన్ లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద రైతులు పంటలకు బీమా నమోదు చేయించుకోవాలన్నారు. శనగ, మినుము, వరి, జొన్న, మొక్క జొన్న, మిరప పంటలకు బీమా చేయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి శ్రీనివాసరెడ్డి, పట్టు పరిశ్రమ శాఖ అధికారి వెంకటేశ్వర్లు, గ్రామ వ్యవసాయ, పట్టు పరిశ్రమ సహాయకులు రాణా ప్రతాప్ ,సురేఖ, పశు సంవర్ధక సహాయకులు రఘు, జ్యోత్స్న, రైతులు పాల్గొన్నారు. పుల్లలచెరువు : మండల పరిధిలోని నాయుడుపాలెం, కవలకుంట్ల గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఒ నిర్మలాదేవి మాట్లాడుతూ ప్రస్తుతం కంది పంట పూత దశలో ఉందన్నారు. ఈ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు..ఈ కార్యక్రమంలో ఎఐఎఒ రామయ్య, ఎఎంసి స్టాఫ్ శ్రీనివాస్, విఎఎ నజిరున్నిసా భాను పాల్గొన్నారు. మద్దిపాడు : మండల పరిధిలోని కీర్తిపాడు, రాచవారిపాలెం గ్రామాలలో పొలం పిలుస్తోంది నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఒ రమేష్ బాబు మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వ అమలు చేస్తున్న పథకాలు గురించి వివరించారు. ప్రస్తుతం రైతులకు సబ్సిడీ మీద శనగ విత్తనాలు అందజేస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ సిబ్బంది, గ్రామ రైతులు పాల్గొన్నారు.