ప్రభుత్వ బడుల్లో చేర్పించండి

Apr 16,2025 21:21

చెల్లూరు, లక్కిడాం గ్రామాల్లో ఉపాధి కూలీలతో డిఇఒ

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ప్రభుత్వ బడుల్లో పిల్లలని చేర్పించాలని, నాణ్యమైన విద్యను అందిస్తామని డిఇఒ యు.మాణిక్యంనాయుడు తెలిపారు. బుధవారం చెల్లూరు, లక్కిడాం గ్రామాల్లో ఉపాధి పనులు చేస్తున్న కూలీలు వద్దకు వెళ్లి మాట్లాడారు. ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్యతో పాటు, యూనిఫాం, పుస్తకాలు ,ఆటలు, అన్ని రకాలు మౌలిక సదుపాయాలు పాఠశాలలో కల్పిస్తామని తెలిపారు. పిల్లల్ని బంగారు భవిష్యత్‌ ప్రభుత్వ పాఠశాలల్లోనే లభ్యమవుతుందన్నారు. నిష్ణాతులైన ఉపాధ్యాయులతో విద్యాబోధన ఉంటుందన్నారు. డిఇఒతోపాటు డిప్యూటీ డిఇఒ వెంకటరమణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

విద్యార్థుల ఇళ్లకు వెళ్లి..

ఐదేళ్లు పైబడిన చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని సమగ్ర శిక్ష ఎపిసి డాక్టర్‌ ఎ.రామారావు కోరారు. బుధవారం జిల్లాలోని పలు కెజిబివిల్లో పర్యటించి ,అంగన్వాడీ కేంద్రాల్లో చదువుతున్న పిల్లలను సమీప ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు తల్లిదండ్రులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం విద్యార్థుల ఇళ్లకు వెళ్లి, ప్రభుత్వ పాఠశాలలో చేరిక కోసం అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు నాణ్యమైన విద్యతో పాటు పుస్తకాలు, యూనిఫాం, బ్యాగులు అందిస్తారని తెలిపారపు. అర్హత కలిగిన నిపుణులైన ఉపాధ్యాయులు బోధన చేస్తున్నారని, క్రీడలు, సాంస్కతిక కార్యక్రమాలు, ఆరోగ్య శిబిరాలు వంటి ప్రోత్సాహక కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. బాల బాలికల భద్రత, అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ ఉంటుందన్నారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష సిఎంఒ ఆదినారాయణ, ఎఎంఒ ప్రసాద్‌, ఎపిఒ గోపిచంద్‌, ఎఎస్‌ఒ సూర్యారావు, ఉపాధ్యాయులు, సిఆర్‌ఎంటిలు పాల్గొన్నారు.

➡️