వయోవృద్ధుల జీవితాలకు భరోసా ఇవ్వండి

Feb 11,2024 17:00 #Kakinada
  • రాజకీయ పార్టీలకు సీనియర్‌ సిటిజన్ల వినతి

ప్రజాశక్తి-కాకినాడ : వయోవృద్ధుల సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన తల్లిదండ్రులు, వృద్ధుల పోషణ, సంరక్షణ చట్టాన్ని పటిష్టవంతంగా అమలు చేసి భరోసానివ్వాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సీనియర్‌ సిటిజన్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, ప్ర«ధాన కార్యదర్శులు వి.నారాయణమూర్తి, కె.రామచంద్రరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జనాభాలో 13 శాతం, ఓటర్ల లిస్టులో 18 శాతంగా ఉన్న వయోవృద్ధుల సమస్యలపై అన్నిరాజకీయ పార్టీలు సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక సూపర్‌బజార్‌ కార్యాలయ ఆవరణలో ఏపీ స్టేట్‌సీనియర్‌ సిటిజన్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ కాకినాడ జిల్లా సమావేశం ఆదివారం జరిగింది. సమావేశంలో రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ వృద్ధుల సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ, లేదా ప్రత్యేక కమిషనరేట్‌ను ఏర్పాటు చేయాని, ఇందుకోసం బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. 60 ఏళ్ళు పైబడిన అర్హులైన వృద్ధులకు రూ.6,500లు వృద్ధాప్య పెన్షన్‌ ఇవ్వడంతోపాటు ఆర్టీసీలో సీనియర్‌ సిటిజన్లకు 50శాతం రాయితీ అమలు చేయాలని కోరారు. అన్ని పట్టణ, మండల కేంద్రాల్లో సీనియర్‌ సిటిజన్స్‌ కోసం డే కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

అడహక్‌ కమిటీ ఏర్పాటు

రాష్ట్ర సీనియర్‌ సిటిజన్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ కాకినాడ జిల్లా అడహక్‌ కమిటీని ఆదివారం ఏర్పాటు చేశారు. అధ్యక్షునిగా బల్లమూడి సూర్యనారాయణమూర్తి (పెద్దాపురం), ప్రధాన కార్యదర్శిగా ఆర్‌.ఎస్‌.సుధాకరరావు, అసోసియేట్‌ అధ్యక్షునిగా జి.విశ్వేశ్వరరావు, కోశాధికారిగా వి.రామసుబ్బారావు, ఉపాధ్యక్షునిగా జెఎస్‌వి ప్రసాద్, కార్యనిర్వాహక కార్యదర్శిగా మండవిల్లి భాస్కరరావు, కార్యదర్శులుగా వి.శివాజీగణేష్, జీవీఎస్‌వీవీ సత్యనారాయణమూర్తిలను నియమించారు. సమాశంలో రాష్ట్ర కోశాధికారి మదన్‌మోహన్‌రెడ్డి, రాష్ట్ర మహిళాధ్యక్షురాలు కొండ నిర్మల తదితరులు పాల్గొన్నారు.

➡️