ప్రజాశక్తి – వెదురుకుప్పం ( చిత్తూరు జిల్లా) : గంగాధర నెల్లూరు నియోజకవర్గం పరిధిలో వెదురుకుప్పం మండలం
మండలంలోని 11 కె.వి విద్యుత్ స్తంభానికి తీగలు దట్టంగా అల్లుకున్నాయి. టికేయం పురం జాతీయ రహదారి పక్కనే తీగలు దట్టంగా అల్లుకొని పైకి ఎగబాకాయి . ఎవరైనా అటువైపు వెళితే ప్రమాదవశాత్తు చేయి తగిలితే కరెంట్ సప్లై అయితే.. ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరు అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. జాతీయ రహదారి పక్కనే ఇలా ఉంటే విద్యుత్ అధికారులు కానీ.. సచివాలయ సిబ్బంది లైన్మెన్ గాని ఎవరు స్పందించక అలానే చూస్తూ వెళ్ళిపోతూ ఉంటారని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రమాదం జరగకముందే ఈ తీగలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.
