పర్యావరణంపై అవగాహన ర్యాలీ

Jun 8,2024 00:03 #Environment day rally
Environment day rally

ప్రజాశక్తి – యంత్రాంగం ఆరిలోవ : ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మ్యాజిక్‌ బస్‌ ఇండియా ఫౌండేషన్‌ ఆధ్వర్యాన శుక్రవారం బిఎన్‌ఆర్‌.నగర్‌లో పర్యావరణంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ కోసం పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, మొక్కలను నాటి పర్యావరణాన్ని పరిరక్షించడంపై అవగాహన కల్పించారు. అనంతరం మహిళలు, చిన్నారులు, ఆశా వర్కర్లు, శానటరీ సిబ్బంది పర్యావరణాన్ని రక్షించాలని కోరుతూ బిఎన్‌ఆర్‌ నగర్‌ నుంచి తోటగరువు మీదుగా ఆరిలోవ అంబేద్కర్‌ విహ్రం వరకు ర్యాలీ నిర్వహించారు. అంతకు ముందు బిఎన్‌ఆర్‌ నగర్‌లో చిన్నారులు, మహిళలచే మొక్కలు నాటించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ సూపర్‌వైజర్‌ శ్రీనివాసరావు, లలిత, రమణ, తవిటినాయుడు, మ్యాజిక్‌ బస్‌ ఇండియా ఫౌండేషన్‌ టిఎంఒ ఆర్‌.శంకరరావు, డి.సాయిరాం, యుష్మా, స్వాతి, గౌతమి, సాయి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. భీమునిపట్నం : మండలంలోని మజ్జిపేట జెడ్పీ హైస్కూల్‌లో మ్యాజిక్‌ బస్‌ సంస్థ ఆధ్వర్యాన శుక్రవారం విద్యార్థులకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. పర్యావరణ ప్రాధాన్యతను తెలుపుతూ చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు బాలాజీ, ఎస్‌ఎంసి చైర్మన్‌ లక్ష్మణరావు, ఎఎన్‌ఎం రమణమ్మ, ఆశా వర్కర్‌ ఈశ్వరమ్మ, మ్యాజిక్‌ బస్‌ మానిటరింగ్‌ అధికారి దూడ రమేష్‌, సభ్యులు శారద, దుర్గ, రమ్య, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు

➡️