వ్యర్థాల నిర్వహణతోనే పర్యావరణ పరిరక్షణ

Jun 11,2024 21:34

ప్రజాశక్తి- రేగిడి : పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వ్యర్ధాలు ఎప్పటికప్పుడు తొలగించి వాటి నిర్వహణతోనే పర్యావరణ పరిరక్షణ కలుగుతుందని రాజాం న్యాయ సేవా సంఘం అధ్యక్షులు, సీనియర్‌ సివిల్‌ జడ్జి సిహెచ్‌ వివేక్‌ ఆనంద్‌ శ్రీనివాస్‌ అన్నారు. ఈ మేరకు మంగళవారం రాజాం మండలం, గార్రాజు చీపురుపల్లి గ్రామంలో న్యాయ సేవ సంఘం రాజాం ఆధ్వర్యంలో వ్యర్ధాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ, న్యాయపరమైన అంశాలు, ప్రభుత్వ విధివిధానాలు, ప్రత్యేక న్యాయ అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం వాతావరణంలో మార్పులు కారణంగా అనేక రోగాలు బారిన పడుతున్నారన్నారు. అందుకు ప్రతి ఒక్కరూ మొక్కల నాటాలన్నారు. పర్యావరణ సమతుల్యానికి గురుకావద్దని, మొక్కలు నాటడంతో భావితరాల ఆరోగ్యకరమైన, అహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలని సూచించారు. పట్టణ ంలో వ్యర్ధాలతో చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాలు ఏర్పాటు చేయ డం పట్ల ఎరువులు తయారుచేసి పంట పొలాలకు సారవంతమైన నేలలు తయారు చేసుకోవచ్చన్నారు. ఎరువులు రైతులకు అమ్మకం ద్వారా గ్రామ పంచాయతీలకు ఆదాయం సమకూరి గ్రామాభివృద్ధికి తోడ్పడుతుందన్నారు. జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎస్‌విబి కృష్ణ సాయి తేజ్‌ మాట్లాడుతూ వ్యర్థ పదార్థాలు పట్టణ శివారులో డంపింగ్‌ యార్డ్‌లో వేయాలని సూచించారు. దీంతో గ్రామాలు, పట్టణాల ప్రజలు ఆరోగ్యంగా ఉంటారన్నారు. వ్యర్ధాల నుంచి ఎరువులు తయారీగా మరల్చడం గొప్ప విషయమన్నారు. ముందుగా న్యాయ మూర్తులు డంపింగ్‌ యార్డ్‌ నిర్వహణ ప్రక్రియను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్‌ జె.రామప్పలనాయుడు, రాజాం బార్‌ అసోసియేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జయదేవ్‌, జాయింట్‌ సెక్రెటరీ శ్రీనివాసరావు, పర్యావరణ పరిరక్షణ సమితి కమిటీ కన్వీనర్‌ ఆర్‌విఎస్‌ నాయుడు, రెడ్‌ క్రాస్‌ ప్రతినిధులు కొత్తా సాయి ప్రశాంత్‌ కుమార్‌, ఎంపిడిఒ కార్యాలయ ఎఒ లక్ష్మణరావు, శానిటేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రసాద్‌, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

➡️